Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణను కేసీఆర్ పార్టీలోంచి తొలగించాడు... నేను చేర్చుకున్నా: వైఎస్ షర్మిల

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను అవమానించేలా చుట్టా, బీడి అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడారంటూ టీఆర్ఎస్ నాయకులు కావాలనే దుష్ఫ్రచారం చేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు అన్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను అవమానించేలా చుట్టా, బీడి అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడారంటూ టీఆర్ఎస్ నాయకులు కావాలనే దుష్ఫ్రచారం చేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు అన్నారు. తెలంగాణ ఉద్యమసమయంలో ఒంటిపై పెట్రోల్ మీద పోసుకొని అగ్గిపెట్టె మర్చిపోయిన మంత్రి హరీష్ రావు ఇలా గోబెల్స్ ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. రాజశేఖర్ రెడ్డి అన్నట్లుగా ఒకటికి వందసార్లు చెబితే అది నిజం అయిపోదని షర్మిల అన్నారు. 

నిజానికి తెలంగాణ బిడ్డలకు పెద్దపీట వేసిన మహానేత వైఎస్సార్ అని షర్మిల తెలిపారు. తెలంగాణలో బోర్ల కింద ఎక్కువగా పంటసాగు జరుగుతుందనే అధికారంలోకి వచ్చిన వెంటనే వీరికి అండగా వుండేలా తొలి సంతకం ఉచిత విద్యుత్ పైనే  చేశారన్నారు. అలాగే జలయజ్ఞం ప్రాజెక్టులు ఇక్కడే ఎక్కువ నిర్మించారని... ఏ విషయంలో తీసుకున్నా తెలంగాణకు వైఎస్సార్ న్యాయమే చేసారన్నారు. ఆయన బిడ్డగా తెలంగాణను గౌరవించాను కాబట్టే పార్టీ పేరులో తన తండ్రితో సమానంగా తెలంగాణను చేర్చానని పేర్కొన్నారు. తెలంగాణ ఉనికి అవసరం లేదని కేసీఆర్ ఆల్రెడి  పార్టీపేరులో వుంటే తొలగించాడు... కానీ నేను నా తండ్రి పేరుతో పాటే తెలంగాణను చేర్చుకున్నానని షర్మిల పేర్కొన్నారు.