మునుగోడులో వైఎస్సార్ టిపి పోటీచేస్తే కేసీఆర్ దొరకు కన్నీళ్లే..: షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

నల్గొండ : సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వేడెక్కిన మునుగోడు రాజకీయాలపై వైఎస్సార్ తెలంగాణ చీఫ్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

First Published Aug 26, 2022, 1:16 PM IST | Last Updated Aug 26, 2022, 1:16 PM IST

నల్గొండ : సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వేడెక్కిన మునుగోడు రాజకీయాలపై వైఎస్సార్ తెలంగాణ చీఫ్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేవలం ఒక్క ఉపఎన్నికకే  మన సీఎం సార్ భయపడుతున్నాడు... అప్పుడే కేసీఆర్  కు భయం పుట్టిందన్నారు. తనను ఆగం చేయకండి అని కేసీఆర్ దొర మునుగోడు ప్రజలకు వంగివంగి దండం పెడుతూ వేడుకుంటున్నాడని షర్మిల ఎద్దేవా చేసారు. అసలు ప్రజల్లో ఏ ఆదరణ లేని కాంగ్రెస్, బిజెపి బరిలో వుంటేనే కేసీఆర్ ఇంత ఆగం అవుతుండు... ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీ బరిలో వుంటే ఆయన మునుగోడు ప్రజల కాళ్లు పట్టుకుంటాడో లేక కన్నీరు పెట్టుకుంటాడో చూడాలి అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు.