Asianet News TeluguAsianet News Telugu

నల్లటి చీర, చేతికి దట్టీ... ఊదు పొగల మధ్య ముస్లిం వేషధారణలో వైఎస్ షర్మిల

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లింలు సోదరభావంతో నిర్వహించుకునే పండగ మొహర్రం (పీర్ల పండగ).

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లింలు సోదరభావంతో నిర్వహించుకునే పండగ మొహర్రం (పీర్ల పండగ). ఈ పండగను పురస్కరించుకుని హైదరాబాద్ పాతబస్తీలోని డబిర్ పుర బీబీకా ఆలంను వైఎస్సార్  తెలంగాణ పార్టీ అదినేత్రి వైఎస్ షర్మిల సంందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసారు. నల్లటి దుస్తుల్లో దర్గాకు చేరుకున్న షర్మిల పూల చాదర్ సమర్పించారు. ఆమెకు దర్గా నిర్వహకులు దట్టీ కట్టి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా పోరాటానికి, త్యాగానికి ప్ర‌తీకైన మొహ‌ర్రం.. ప్ర‌తి ఒక్క‌రిలో పోరాట స్ఫూర్తిని, త్యాగనిరతిని నింపాల‌ని కోరుకున్నానని షర్మిల తెలిపారు. ఆ అల్లా కృప ప్ర‌జ‌లంద‌రిపై ఉండాల‌ని ప్రార్థించానని షర్మిల అన్నారు. 

Video Top Stories