జగన్ ఇస్తారా లేక కేసీఆరా... మాకు మాత్రం అవి కావాలి..: భద్రాచలం మహిళల ఆందోళన
భద్రాచలం : దిక్కూమొక్కూ లేక దేవాలయానికి చెందిన స్థలంలో గుడిసెలు వేసుకుని తలదాచుకుంటుంటే ఆలయ అధికారులు ఖాళీచేయిస్తున్నారని భద్రాచలంలోని ఆదర్శ్ నగర్ కు చెందిన మహిళలు ఆందోళనకు దిగారు.
భద్రాచలం : దిక్కూమొక్కూ లేక దేవాలయానికి చెందిన స్థలంలో గుడిసెలు వేసుకుని తలదాచుకుంటుంటే ఆలయ అధికారులు ఖాళీచేయిస్తున్నారని భద్రాచలంలోని ఆదర్శ్ నగర్ కు చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. తమకు ఏపీ సీఎం జగన్ గానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ గానీ ఇళ్ళు కట్టించి ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేసారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని మహిళలు తెలిపారు. రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... ఇప్పటికయినా స్పందించి తమకు న్యాయం జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన మహిళలు ఇరు ప్రభుత్వాలను డిమాండ్ చేసారు.