Asianet News TeluguAsianet News Telugu

నిజాంపేటలో ఘోర ప్రమాదం... ఒక్కసారిగా కుప్పకూలిన భవనం

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెను ప్రమాదం తప్పింది. 

First Published Sep 14, 2023, 4:02 PM IST | Last Updated Sep 14, 2023, 4:02 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెను ప్రమాదం తప్పింది. నిజాంపేట ఎన్ఆర్ఐ కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు గాయపడ్డారు. ప్రాణనష్టమేమీ జరగలేదని... గాయపడిన భవననిర్మాణ కూలీలు లక్ష్మి, అనితల పరిస్థితి కూడా మెరుగ్గానే వున్నట్లు సమాచారం.నిజాంపేట రెండో వార్డులోని ఎన్ఆర్ఐ కాలనీలో ఓ భవనం స్లాబ్ వేస్తుండగా మొదటి, రెండో అంతస్తు కుప్పకూలిపోయాయి. డిజైన్ సరిగ్గా లేకపోవడం, హడావుడిగా నాసిరకం పనులు చేయడంవల్లే భవనం కుప్పుకూలినట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ అనుమతితోనే నిర్మాణం చేపడుతున్నట్లు నిజాంపేట్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.