వెనక్కితగ్గని ఉద్యోగులు, సెల్ఫ్ డిస్మిస్ అంటున్న ప్రభుత్వం: తెలంగాణలో సమ్మెయథాతథం (వీడియో)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. ఆరు రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ నిరసన తెలుపుతున్నారు. అన్ని బస్ డిపోల దగ్గర ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

First Published Oct 10, 2019, 7:16 PM IST | Last Updated Oct 10, 2019, 7:16 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. ఆరు రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ నిరసన తెలుపుతున్నారు. అన్ని బస్ డిపోల దగ్గర ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీని బతికించేందుకు తాము సమ్మెకు దిగితే....తమ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ వ్యక్తిగత డిమాండ్ల కోసం తాము సమ్మెకు పిలుపునివ్వలేదని ఆర్టీసీని బతికిందుకే ఇచ్చామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.