ఎమ్మెల్యే ఎదుటే... టీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల గొడవ
కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంటలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంటలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ విజయ, ఎంపీపీ పావని కి మధ్య ప్రోటోకాల్ విషయంలో వాగ్వివాదం జరిగింది. తన అధ్యక్షతన కాకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ఎంపీపీ పావని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎదుటే జడ్పి ఛైర్ పర్సన్, ఎంపీపీ వాగ్వివాదానికి దిగారు.