ఈయన టీచర్ కాదు.. కలెక్టర్.. సొంత అన్నలా పిల్లలకు మోటివేషన్ | Khammam Collector | Asianet News Telugu
ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలో ఉన్నతాధికారి అయినప్పటికీ విద్యార్థులతో పాటు నేలపై కూర్చొని మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంటోంది. కొడితే పెద్ద జాబే కొట్టండి.. చిన్నాచితకా ఉద్యోగాలతో ఆగిపోకండి అంటూ పిల్లలకు ఆయన చేస్తున్న మోటివేషన్ చూసి.. సోషల్ మీడియాలో ఈ కలెక్టర్ సూపర్ అని కామెంట్స్ వస్తున్నాయి.