అత్యంత క్రూరంగా... యువకుడిని చితకబాదిన హిజ్రా

 సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ లో ఓ హిజ్రా హంగామా సృష్టించింది. 

First Published Jan 18, 2021, 1:51 PM IST | Last Updated Jan 18, 2021, 1:51 PM IST

 సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ లో ఓ హిజ్రా హంగామా సృష్టించింది. ఓ యువకుడిని అత్యంత క్రూరంగా చితకబాదిన హిజ్రా స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో వున్నా వదిలిపెట్టలేదు. రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. బస్టాండ్ లో నిద్రిస్తున్నతన జేబులో నుంచి డబ్బులు దొంగిలించాడని  ఈ యువకుడు ప్రయత్నించాడంటూ ఈ దాడికి పాల్పడింది. ఈడ్చుకుంటూ వెళ్లి ‌బూటుకాలితో తంతూ, కట్టెలతో దాడికి దిగింది. ఇతర ప్రయాణికులు ఈ హిజ్రాను అడ్డుకునే సాహసం చేయలేక 108 కు సమాచారాన్ని అందించారు. దీంతో అంబులెన్స్ అక్కడకు చేరుకుని  యువకున్ని ఏరియా ఆసుపత్రికి తరలించింది.