అకాలవర్షానికి తడిసిన ధాన్యం.. 20 రోజులైనా తూకం వేయకనే..
జగిత్యాల జిల్లా,ధర్మపురిలో ఆకాలవర్షంతో వరిధాన్యం తడిసి ముద్దయ్యింది.
జగిత్యాల జిల్లా,ధర్మపురిలో ఆకాలవర్షంతో వరిధాన్యం తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులవుతున్నా తూకం వేయకపోవడంతో పంట నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమకు నచ్చినవారికే తూకం వేస్తూ రేపురా, మాపురా అంటూ
తిప్పించుకుంటున్నారని ఇవ్వాళ నీటి పాలైందని వాపోతున్నారు.