హుజూర్ నగర్ ప్రచారం: గుడిసెల్లోకి... బైక్ పై... సత్యవతి రాథోడ్ (వీడియో)
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో గిరిజనశాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నెరేడుచర్ల మండలంలోని రామకృష్ణ తండా, మూసి వడ్డు తండా, పులగం తండా, జగ్నా తండా లలో పర్యటించి వారికి మద్దతు పలికారు.

వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి హామీ ఇచ్చారు. తండాలలో కనీసం రోడ్డు వసతి లేక బైక్ మీద తండాలలో పర్యటించారు. వచ్చే 100 రోజుల్లో ఈ రోడ్డును మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
కనీసం నలుగురు మనుషులు కూడా ఉండలేని గుడిసెలు చూసి బాధ పడ్డారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఇంకా తండాలలో ఉండడంపై ధ్వజమెత్తారు.