అఘోరాలతో భర్తను చంపించాడని అనుమానం.. ఆడపడుచు భర్తను సజీవదహనం..
జగిత్యాల జిల్లాలో ఓ మనిషిని సజీవ దహనం చేసిన దారుణ సంఘటన కలకలం రేపింది.
జగిత్యాల జిల్లాలో ఓ మనిషిని సజీవ దహనం చేసిన దారుణ సంఘటన కలకలం రేపింది.
రాచర్ల పవన్ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగిని గదిలో బందించి పెట్రోలు పోసి అతని సొంత బంధవులే సజీవదహనం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సజీవ దహనంపై వివరాలు సేకరిస్తున్నారు.. పవన్ చిన్న బహ్మర్ది జగన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. దీనికి పవనే ఏదో చేయించాడని కక్ష్య కట్టిన ఆయన భార్య సుమలత ఈ దారుణానికి ఒడిగట్టింది. జగిత్యాల డీఎస్పీ వెంకరమణ, సీఐ కిషోర్, ఎస్సై నాగరాజు, శివకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి దర్యాప్తు చేపట్టారు.