Asianet News TeluguAsianet News Telugu

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులతో 'ఛలో హైదరాబాద్' కు సిద్దమే..: శ్రీధర్ బాబు హెచ్చరిక

పెద్దపల్లి : తమ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ఆందోళనలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మద్దతు తెలిపారు.

పెద్దపల్లి : తమ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ఆందోళనలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మద్దతు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్జీ3 జీఎం కార్యాలయం ముందు సింగరేణ కార్మికులు చేపట్టిన ఆందోళనలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై, వారిని రాజకీయాల కోసం వాడుతున్నారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హత్యలు, దోపిడీలు చేసేవారిని పట్టుకోవాల్సిన పోలీసులు తమ సమస్యల పరిష్కారానికై ప్రజలు చేపట్టే ధర్నాలు, ఆందోళనలను అణచివేయడమే పనిగా పెట్టుకున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. 

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ ఆదేశాలను సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు. కోర్టు ఆదేశాలమేరకు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేసారు. కోల్ ఇండియాలో మాదిరిగానే సింగరేణిలోనూ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు అందించాలని కోరారు. ఈ నెల 22న జేఏసి జరిపే చర్చలు ఫలించకుంటే ఛలో హైదరాబాద్ కు పిలుపునివ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సూచించారు.