కేటీఆర్ ఇలాకాలో డబుల్ బెడ్రూం రగడ... సిరిసిల్ల కలెక్టరేట్ ముట్టడితో ఉద్రిక్తత
సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ పర్యటన రోజే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాసంఘాల ఆందోళన చేపట్టాయి.
సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ పర్యటన రోజే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాసంఘాల ఆందోళన చేపట్టాయి. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు కలెక్టరేట్ ముట్టడికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే ర్యాలీగా కలెక్టరేట్ వైపు వెళుతున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రజాసంఘాల నాయకులు పోలీసులను ప్రతిఘటించడంతో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాగోలా ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడినుండి తరలించారు పోలీసులు.
మంత్రి కేటీఆర్ ను కలిసి తమ బాధలు చెప్పుకుందామని వస్తే తమను పోలీసులు అరెస్ట్ చేసారని మహిళలు వాపోయారు. అన్ని అర్హతలున్న నిరుపేదలకు సైతం బెడ్రూం ఇళ్లు దక్కలేదని... చాలిచాలని ఇళ్ళు కట్టించి కేటీఆర్ సిరిసిల్ల పేదలను మోసం చేసాడని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు.