ఆందోళన బాటలో ఉస్మానియా వైద్యులు.. బిల్డింగ్ కూల్చాలంటూ డిమాండ్..
save OGH, Build new OGH పేరుతో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో డాక్టర్లు ఆందోళన బాట పట్టారు.
save OGH, Build new OGH పేరుతో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. కూలిపోతున్న బిల్డింగ్ ను కూల్చద్దు అంటూ అడ్డుపడటం అవివేకం అంటున్నారు. ప్రాణాలు నిలబెట్టడానికే దీనిని కట్టారు కానీ అది కూలి ప్రాణాలు తీసేలా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రజల ప్రాణాలు, పని చేస్తున్న మా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2015 లో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి కొత్త బిల్డింగ్ నిర్మించడానికి అధికారాలకు ఆదేశాలు ఇచ్చారు.కానీ కొంత మంది అడ్డుకుని, కోర్టుకి వెళ్లి స్టే తెచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో బిల్డింగ్ నిర్మాణానికి ఎవరైనా అడ్డు పడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.