న్యూస్ @ 90 సెకండ్స్
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీలో చేరనున్నారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీలో చేరనున్నారు. సోమవారం నాడు గిరి క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిశారు. అమరావతిపై టీడీపీ ఆందోళన చేస్తున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ సీఎస్ ఎస్‌కె జోషీ పదవీకాలం రేపటితో పూర్తికానుంది. జోషీ స్థానంలో తెలంగాణ సీఎస్ పదవి కోసం సోమేష్ కుమార్, అజయ్ మిశ్రాల మధ్య పోటీ నెలకొంది. మొత్తం 14 మంది స్పెషల్ సీఎస్‌లలో అజయ్ మిశ్రా కంటే సోమేష్ కుమార్ వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం.