Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న నూతన సచివాలయం... మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలన

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. 

First Published Dec 21, 2022, 11:32 AM IST | Last Updated Dec 21, 2022, 11:32 AM IST

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రాత్రి నిర్మాణంలో వున్న సచివాలయం వద్దకు వెళ్లి అధికారులు, వర్క్ ఏజన్సీకి పలు సలహాలు సూచనలిచ్చారు. ఇప్పటికే వచ్చేఏడాది పిబ్రవరిలో నూతన సచివాలయ ప్రారంభోత్సవించాలని సీఎం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేయడంతో అప్పట్లోగా నిర్మాణం పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.  అందులో భాగంగానే ఇప్పటికే శరవేగంగా నిర్మాణ పనులు సాగుతుండగా నిత్యం మంత్రి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి ప్రత్యక్షంగా వెళ్లి సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.