Asianet News TeluguAsianet News Telugu

మీరు గవర్నర్ కావచ్చు కానీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావద్దా?: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేయగా గవర్నర్ తిరస్కరించడంపై కేటీఆర్ స్పందించారు. 

First Published Apr 7, 2022, 5:56 PM IST | Last Updated Apr 7, 2022, 5:56 PM IST

కరీంనగర్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేయగా గవర్నర్ తిరస్కరించడంపై కేటీఆర్ స్పందించారు. పొలిటికల్ లీడర్ గా వున్న మీరు గవర్నర్ కావచ్చే కానీ  కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావొద్దా? అని కేటీఆర్ గవర్నర్ ను నిలదీసారు. గవర్నర్ అంటే తమకు గౌరవం ఉందని... అందుకే ఎక్కడా గవర్నర్ ని అవమానించలేదన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు  గవర్నర్ గా నరసింహన్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో మాట్లాడిన మాటలు బాధించాయని కేటీఆర్ పేర్కొన్నారు.