బిజెపి వాళ్ల సక్కదనమిదీ... బీబీ నగర్ ఎయిమ్స్ లో పరిస్థితులపై మంత్రి హరీష్ సీరియస్

భువనగిరి: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వైద్య సదుపాయాల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందే ఒక్క ఎయిమ్స్...

First Published May 20, 2022, 4:46 PM IST | Last Updated May 20, 2022, 4:46 PM IST

భువనగిరి: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వైద్య సదుపాయాల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందే ఒక్క ఎయిమ్స్... దాన్ని కూడా గాలికి వదిలేసారని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి భూములు, భవనాలు ఇచ్చి అన్ని రకాల మద్దతు తెలిపినా పేదలకు ప్రయోజనం లేకుండా పోయిందని హరీష్ మండిపడ్డారు. భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో SNCU వార్డ్ , పిడియాట్రిక్ వార్డ్ లను ప్రారంభించి మంత్రి హరీష్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమానికి వెళుతూనే మధ్యలో ఎయిమ్స్ ను సందర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి  ఏ మాత్రం బాధ్యత లేదని మండిపడ్డారు. బీజేపీ వాళ్ళు మాటలకే  పనికి వస్తారు... ఎయిమ్స్ ను చూస్తే తెలుస్తుంది బీజేపీ పాలకుల సక్కదనం అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నిర్మించిన సూర్యాపేట, నల్గొండ మెడికల్ కాలేజిలు ఎలా ఉన్నాయో వెళ్లి చూడండి అంటూ హరీష్ రావు బిజెపి నాయకులపై విరుచుకుపడ్డారు.