Asianet News TeluguAsianet News Telugu

కుటుంబ సక్షేమంలోనూ హరీష్ మార్క్... జనగామ మాతాశిశు హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ

జనగామ: గతంలో నీటిపారుదల శాఖలో తన మార్క్ చూపించిన హరీష్ రావు ఈసారి వైద్యారోగ్య శాఖలో ఆ పని చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలను మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతూనే మరోవైపు ప్రజలకు అందుతున్న వైద్యం గురించి తెలుసుకునేందుకు హాస్పిటల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇలా తాజాగా జనగామ జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంక్షేమ ఆసుపత్రిని వైద్యారోగ్య మంత్రి హరీష్ ఆకస్మికంగా సందర్శించారు. నకిరేకల్ వెళుతూ మార్గమధ్యంలో జనగామ ఎంసిహెచ్ వద్ద కాన్వాయ్ ని  ఆపిన మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ముందు సిబ్బంది వద్దకు కాకుండా నేరుగా పేషంట్స్ వద్దకు వెళ్లి ఆసుపత్రిలో అందుతున్న సేవలు, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పేషెంట్స్ తో మంత్రి ఆత్మీయంగా మాట్లాడారు. ఎలాంటి హడావుడి లేకుండా సాదాసీదాగా హాస్పిటల్ కు వచ్చి తనిఖీ చేపట్టిన మంత్రిని చూసి ఆసుపత్రి సిబ్బంది అవాక్కయ్యారు. ఆసుపత్రి మొత్తం కలియతిరిగిన మంత్రి కొన్ని సమస్యలను గుర్తించారు. దీంతో అక్కడి నుండే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకిటి కరుణ తో ఫోన్లో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కు వెంటనే నివేదిక  ఇవ్వాలని   ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని మంత్రి హరీష్ హెచ్చరించారు. 