Asianet News TeluguAsianet News Telugu

లాయర్ దంపతుల హత్యకు ముందు... పుట్టా మధుతో కలిసున్న కుంట శ్రీను

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామం దగ్గరలో పట్టపగలే నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులపై కత్తులతో దాడి చేసి అతి దారుణంగా హతమార్చారు.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామం దగ్గరలో పట్టపగలే నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులపై కత్తులతో దాడి చేసి అతి దారుణంగా హతమార్చారు. ఈ దారుణానికి పాల్పడింది  కుంట శ్రీను అని రక్తపు మడుగులో పడివున్న సమయంలో వామనరావే తెలిపారు. దీంతో ఈ శ్రీను ఎవరో కాదు... టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే,పెద్దపెల్లి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు అనుచరుడు. న్యాయవాదుల దంపతుల హత్యకు కొద్ది నిమిషాల ముందే పుట్ట మధుతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు శ్రీను.  ఈ పోగ్రామ్ నుంచి నేరుగా హత్య చేయడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. నిందితుడిగా అనుమానిస్తున్న ఈ శ్రీను ప్రస్తుతం రామగిరి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా వున్నాడు.