Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ మేయర్ పై భూకబ్జా ఆరోపణలు... వికారాబాద్ లో బాధితుల ఆందోళన

వికారాబాద్ : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆమె సోదరుడు వెంకటేశ్వర రావు తమను బెదిరించి పదెకరాల భూమిని కబ్జా చేసారంటూ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మీర్జాపూర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

First Published Dec 29, 2022, 11:26 AM IST | Last Updated Dec 29, 2022, 11:26 AM IST

వికారాబాద్ : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆమె సోదరుడు వెంకటేశ్వర రావు తమను బెదిరించి పదెకరాల భూమిని కబ్జా చేసారంటూ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మీర్జాపూర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పోలీస్ బందొబస్తుతో స్వయంగా మేయర్ దగ్గరుండి భూమిని చదునుచేయిస్తూ పెన్సింగ్ వేయిస్తున్నారని బాధితులు తెలిపారు. మీర్జాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 20 లో పదెకరాల భూమిని గన్ తో బెదిరించి టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కొడుకు వెంకటేశ్వర రావు కబ్జా చేసాడని బాధితులు చెబుతున్నారు.  గతంలో ఈ వివాదంలోనే  ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని వెంకటేశ్వర రావు హత్య చేయించారని... అలాగే మమ్మల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు.