Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll:తాలిబాన్లను తలపించేలా టీఆర్ఎస్ పాలన..: బండి సంజయ్ సంచలనం

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో ఇంతకాలం జోరుగా సాగిన ప్రచారానికి నేటి(బుధవారం)తో తెరపడనుంది. ఈ క్రమంలోనే చివరిరోజు ఎక్కువమంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్నిపార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇలా బిజెపి తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన తాలిబాన్ల రాజ్యాన్ని తలపిస్తుందన్నారు. తెలంగాణలో ఎలాంటి అనుమతులు లేకుండానే తాలిబన్లే కాదు ఎవరెవరో వస్తున్నారన్నారు.  
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవెర్చలేదు... కాబట్టే హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసిఆర్ రాలేదన్నారు. 

First Published Oct 27, 2021, 2:08 PM IST | Last Updated Oct 27, 2021, 2:08 PM IST