Asianet News TeluguAsianet News Telugu

మృదువైన చేతులతో మట్టిన తాకుతూ...పచ్చటి మొక్కకు ప్రాణంపోసిన బాలివుడ్ బ్యూటీ కంగనా

హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

First Published Feb 22, 2023, 10:35 AM IST | Last Updated Feb 22, 2023, 10:35 AM IST

హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. పచ్చటి మొక్కలు నాటే కార్యక్రమంలో సినీ, వ్యాపార, రాజకీయ, క్రీడా ప్రముఖులను భాగస్వామ్యం చేస్తూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ శివారులోని శంషాబాద్ పంచవటి పార్క్ లో మొక్క నాటారు. రంగోలి చందర్, రీతూ రనౌత్, అంజలి చౌహాన్ లకు కంగనా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాల్సిందిగా నామినేట్ చేసారు. 

 ఇప్పటివరకు జరిగిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు కంగానా. ఈ క్రమంలోనే కోట్లాది చెట్లను పెంచే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కు కంగనా ప్రత్యేకంగా అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ హీరోయిన్ కంగనాకు వృక్ష వేదం పుస్తకాన్ని అందించారు.