Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో రైతుల మహాధర్నా : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హౌజ్‌ అరెస్ట్‌...

జగిత్యాల జిల్లా రైతులు మద్దతు ధర కోరుతూ ఈ రోజు మహాధర్నా చేపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డిని గృహ నిర్భందం చేశారు. 

జగిత్యాల జిల్లా రైతులు మద్దతు ధర కోరుతూ ఈ రోజు మహాధర్నా చేపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డిని గృహ నిర్భందం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రైతులు స్వచ్ఛందంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకుని రైతులను అరెస్ట్‌ చేయటాన్ని ఖండించారు.. సీఎం  రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ రైతులను నిండా ముంచుతున్నారని విమర్శించారు. వరికి, మొక్కజన్న కేంద్రాలను ఏర్పటు చేసి మద్దతు ధర కల్పంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 200ల మంది రైతుల ఆందోళన చేపట్టారు.