వ్యవసాయ భూమి కోసం.. వాటర్ ట్యాంక్ ఎక్కి సిరిసిల్ల రైతు నిరసన
సిరిసిల్ల: డబ్బులు మొత్తం చెల్లించి భూమిని కొనుగోలు చేసినప్పటికి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ రైతు నిరసనకు దిగాడు..
సిరిసిల్ల: డబ్బులు మొత్తం చెల్లించి భూమిని కొనుగోలు చేసినప్పటికి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ రైతు నిరసనకు దిగాడు . చందుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు మర్రి రాజు తన న్యాయం జరిగేలా చూడాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టాడు. అయితే అతడి భార్యాపిల్లలు కూడా వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.