ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్ (వీడియో)

తెలంగాణ కార్మిక శాఖ పరిధిలోని వైద్య బీమా సేవల విభాగం ఈఎస్ఐకి మందులు సరఫరా చేసే విషయంలో జరిగిన భారీ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం నుంచే ఏసీబీ అధికారులు దేవికా రాణి ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి మందులు కొనడం, అసలు కొనకుండానే కొని, ఆస్పత్రులకు సరఫరా చేసినట్లు బిల్లులు సృష్టించడం లాంటి చర్యలతో రాష్ట్ర ఖజానాకు కనీసం పది కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగించినట్లు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రైవేటు వ్యక్తులపై ఏసీబీ అవినీతి నిరోధక చట్టం వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసింది.

First Published Sep 27, 2019, 10:54 AM IST | Last Updated Sep 27, 2019, 10:54 AM IST