తూకం వేసిన ధాన్యం కొనడంలేదంటూ రోడ్డెక్కిన రైతులు

తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. 

First Published May 11, 2023, 5:05 PM IST | Last Updated May 11, 2023, 5:05 PM IST

తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడు మద్దికుంట గ్రామంలో మార్కెట్లో తూకం వేసిన వరి ధాన్యం లారీ లోడ్లను రైస్ మిల్లులకు పంపిస్తే రైస్ మిల్లర్ యజమానులు ధాన్యం రంగు మారిందని ,ఔటన్ వస్తలేదంటూ లారీలో దిగుమతి చేసుకోకుండా రిటర్న్ పంపిస్తున్నారని ఆగ్రహించిన రైతులు సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఎంతో కొంత ధాన్యం వెళ్లినప్పటికీ దాన్యం అమ్ముకుందామంటే రైస్ మిల్లర్లు ధాన్యం రంగు మారిందని ,ఔటన్ వస్తలేదని ,లార్లను దిగమతి చేసుకోకుండా తిరిగి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .తెలంగాణ ప్రభుత్వం రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్తున్నారు కానీ ఇక్కడ రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి రైస్ మిల్లలు వరి ధాన్యం తీసుకునేలా చూడాలని రైతులు కోరుతున్నారు.