పట్టించుకునే నాధుడేడి... అడవిలోనే 20మంది కరోనా రోగుల ఐసోలేషన్
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో అటవీ గ్రామమైన యత్నారంలో కేవలం 3 రోజుల్లోనే 34 మంది కరోనా బారినపడ్డారు.
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో అటవీ గ్రామమైన యత్నారంలో కేవలం 3 రోజుల్లోనే 34 మంది కరోనా బారినపడ్డారు. ఒక్కో కుటుంబం నుండి ఇద్దరు నుంచి నలుగురికి కోవిడ్ సోకింది. వారిని పట్టించుకునే దిక్కే లేదు. దీంతో వారు అడవినే ఐసొలేషన్ గా మార్చుకున్నారు. ఇళ్లలోనే ఉంటే అందరికీ కోవిడ్ వైరస్ సోకుతుందన్న ఉద్దేశంతో ఏడు కుటుంబాలకు చెందిన 20 మంది గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని ఐసొలేషన్‌గా ఎంచుకున్నారు. కొంతమంది అక్కడే వంట చేసుకుంటుండగా, మరికొంతమందికి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి ఆహారాన్ని పంపిస్తున్నారు. ఇలా తాము కరోనాతో బాధపడుతూ అడవినే ఐసోలేషన్ గా మార్చుకున్నా ఇంతవరకూ తమ వద్దకు అధికారులు, నాయకులు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.