Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ లో కుట్రలు...: అద్దంకి దయాకర్ సంచలనం

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పోలీస్ నియామకాల్లో భాగంగా చేపట్టిన ఫిజికల్ ఈవెంట్స్ యువతకు అన్యాయం చేసేలా వున్నాయని కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ ఆరోపించారు. 

First Published Dec 16, 2022, 3:33 PM IST | Last Updated Dec 16, 2022, 3:33 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పోలీస్ నియామకాల్లో భాగంగా చేపట్టిన ఫిజికల్ ఈవెంట్స్ యువతకు అన్యాయం చేసేలా వున్నాయని కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ ఆరోపించారు. ముఖ్యంగా లాంగ్ జంప్ విషయంలో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని... ఎప్పుడూ లేనిది ఈసారి ఏకంగా 4మీటర్ల లాంగ్ జంప్ పెట్టడం దారుణమన్నారు. ఇండియన్ ఆర్మీ రిక్రూట్ మెంట్ లోనూ కేవలం 3 మీటర్లే వుంటుందని... పక్కరాష్ట్రాలు ఏపీ, తమిళనాడు లోనూ 3.8 మీటర్సే వుందన్నారు. కానీ తెలంగాణ మాత్రం 4 మీటర్లు పెట్టడంతో యువతకు అన్యాయం జరుగుతోందని అన్నారు. తెలంగాణ యువత ఎక్కువమంది క్వాలిఫై కాకుండదనే నాలుగు మీటర్లు పెట్టారని అనుమానం కలుగుతోందన్నారు. అభ్యర్థులందరినీ డిస్ క్వాలిపై చేసి మిగిలిన ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వ కుట్రలు చేస్తోందని అనుమానం యువతలో వుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పోలీస్ రిక్రూట్ మెంట్ లో లాంగ్ జంప్ 3 మీటర్లే పెట్టాలని అద్దంకి దయాకర్ కోరారు.