Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ ఇలాకాకు కలెక్షన్ కార్పోరేషన్ గిరి.. ప్రమాణ స్వీకారానికే లక్షలు వసూలా!: బిజెపి సంచలనం

సిరిసిల్ల : తెలంగాణ పవర్ లూమ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ప్రవీణ్ నియామకంపై బిజెపి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

First Published Sep 20, 2022, 4:59 PM IST | Last Updated Sep 20, 2022, 4:59 PM IST

సిరిసిల్ల : తెలంగాణ పవర్ లూమ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ప్రవీణ్ నియామకంపై బిజెపి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ కలెక్షన్ కార్పోరేషన్ గిరి ఇచ్చినట్లుగా వుందంటూ ఎద్దేవా చేసారు.  పవర్ లూం కమిషన్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ సంఘాల వద్ద నుండి భారీగా అక్రమ వసూళ్లు చేసారంటూ వచ్చిన వార్తలపై బిజెపి నాయకులు స్పందించారు. ఇలా మంత్రి గారే వసూలు చేసుకని తీసుకురమ్మన్నారా? అని ప్రశ్నించారు. గతంలో కూడా మున్సిపల్ ఛైర్మన్ గా వున్నవారు మంత్రి గారే 3శాతం తీసుకోమన్నారని చెప్పారని... ఇప్పుడు అలాగే చెప్పారేమో అంటూ ఆరోపించారు. ప్రమాణ స్వీకారానికి రూ.15లక్షల రూపాయలు వసూలు, బైపాస్ రోడ్డు కాంట్రాక్టుల్లో సైతం రెండు కోట్ల అవినీతి, చెక్ డ్యామ్ ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై మంత్రి కేటీఆర్ స్పందించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేసారు.