కరీంనగర్: శాతవాహన వర్సిటీలో ఎలుగుబంటి సంచారం, భయాందోళనలో విద్యార్ధులు (వీడియో)
కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు దానిని బంధించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్శిటీలో ఎలుగు బంటి సంచారం కలకలం సృష్టించింది. వర్సిటీలో గర్ల్స్ హాస్టల్ గేటు ముందు వెళ్తోన్న ఎలుగు బంటిని కొందరు విద్యార్థినిలు గుర్తించారు.. వెంటనే తమ సెల్ ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. దానిని వెంటనే యూనివర్శిటీ అధికారులకు ,అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో హుటాహుటీన వర్శిటీకి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎలుగుబంటి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వర్శిటిలో ఉన్న చిట్టడవిలో రెండు బావులున్నాయి. ఈ బావుల వద్దకు తరచూ ఎలుగు బంట్లు నీటి కోసం వస్తుంటాయి. దీంతో ఎలుగు బంటి ఎక్కడో వుందో గుర్తించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఎలుగును పట్టుకుంటామని విద్యార్దులు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని అధికారులు భరోసా ఇచ్చారు. అయితే వర్సిటీ క్యాంపస్‌లో ఎలుగు సంచరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది,