లాయర్ దంపతుల హత్యపై... సిబిఐ ఎంక్వయిరీ: బండి సంజయ్ డిమాండ్

మంథని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ సమీపంలో పట్టపగలే నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులను అతి కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. 

First Published Feb 18, 2021, 12:48 PM IST | Last Updated Feb 18, 2021, 12:48 PM IST

మంథని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ సమీపంలో పట్టపగలే నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులను అతి కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో దంపతులిద్దరూ మృతిచెందారు. ఇలా ఒకేసారి దంపతులిద్దరికి కోల్పోయి బాధలో వున్న ఆ కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... న్యాయవాద దంపతుల హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన్నారు. ఈ దారుణంపై సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు.