అయ్యప్పలపై అనుచిత వ్యాఖ్యలు.. కరీంనగర్ లో వెల్లువెత్తిన నిరసనలు..
జగిత్యాల జిల్లా : అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల కరీంనగర్ రోడ్డుపై అయ్యప్ప స్వాములు నిరసన వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లా : అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల కరీంనగర్ రోడ్డుపై అయ్యప్ప స్వాములు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతు తెలిపారు. కోట్లాదిమంది భక్తులు అయ్యప్ప స్వామిని కొలుస్తారని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకున్నందుకు లేఖ రాస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో మతతత్వ స్వేచ్ఛ హక్కు ఉందని ఇతర మగస్తులను కించపరిచే విధంగా వ్యవహరించకూడదని ఎవరైనా మత విద్వేషాలను రెచ్చగొడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.