మనుగోడు ప్రచారం పరాకాష్టకు ... జేపి నడ్డాకు సమాధికట్టిన ప్రత్యర్థులు

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది.

First Published Oct 20, 2022, 11:15 AM IST | Last Updated Oct 20, 2022, 11:15 AM IST

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. అన్నిపార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయడమే కాదు ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసే ప్రచారాన్ని కూడా అదేస్థాయిలో చేపట్టాయి. అయితే ఈ ప్రచారం కాస్త హద్దులు దాటి పరాకాష్టకు చేరుకుంది. కేంద్ర మంత్రి, బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయాడంటూ ఏకంగా అయన సమాధి కట్టారు ప్రత్యర్థులు. ఈ వ్యవహారం మునుగోడులోనే కాదు యావత్ తెలంగాణ సంచలనంగా మారింది. నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ సమస్యను పూర్తిగా తొలగించేందుకు చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుచేస్తామని 2016 లో కేంద్ర మంత్రి జేపి నడ్డా హామీఇచ్చారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 8.2 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే హామీ ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా రీసెర్చ్ సెంటర్ హామీ నేరవేరకపోవడంతో దీన్ని మునుగోడు ఉపఎన్నికలో వాడుకోవాలని బిజెపి ప్రత్యర్థి పార్టీలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కోసం కేటాయించిన స్థలంలో జేపి నడ్డా ప్లెక్సీలతో సమాధి ఏర్పాటుచేసారు.