Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం ఇలా మొదలు... కీలక వీడియోలు వెలుగులోకి

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కీలక వీడియోలు బయటకు వచ్చాయి. 

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కీలక వీడియోలు బయటకు వచ్చాయి. మొదట రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి ప్లాట్ ఫాం పై ఆస్తుల ధ్వంసం, రైళ్లు, సీట్లకు నిప్పు పెట్టడమే కాదు... దీన్నంతా వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఇతర యువకులను రెచ్చగొట్టిన వారిని పోలీసులు గుర్తించారు.  ఆదిలాబాద్ జిల్లాకుచెందిన పృథ్వీరాజ్ అనే యువకుడు ఈ అల్లర్లకు సూత్రధారిగా గుర్తించారు. ప్యాసింజర్ బోగీలోకి వెళ్లి పేపర్ల ద్వారా సీట్లకు నిప్పుపెడుతూ వీడియోలు తీసుకున్నాడు పృథ్వీరాజ్. ఈ వీడియోలు చూసి మిగతా అభ్యర్థులు కూడా రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. ఇలా రైల్వే ఆస్తుల విధ్వంసంలో కీలక నిందితుడిగా వున్న పృథ్వీరాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.