
India vs Pakistan: మ్యాచ్ పిచ్ రిపోర్ట్, రికార్డులు, టీమ్స్
India vs Pakistan Pitch Report: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జరిగే ఐదో మ్యాచ్ లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ఫిబ్రవరి 23, ఆదివారం జరిగే ఈ మ్యాచ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు వేస్తారు. ఈ మ్యాచ్ పాకిస్తాన్ కు డూ ఆర్ డై లాంటింది. ఓడితే పాక్ టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. ఇక భారత్ గెలిస్తే సెమీస్ కు చేరుకుంటుంది. మ్యాచ్ జరిగే దుబాయ్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్టు, ఇక్కడ భారత్, పాకిస్తాన్ రికార్డుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.