జగన్ మీద పవన్ కల్యాణ్ ఫైట్: ఏపీలో కొత్త సమీకరణాలకు సంకేతాలు

జనసేన (jana Sena) అధినేత పవన్ కల్యాణ్ (pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను లక్ష్యం చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

Naresh Kumar  | Published: Oct 1, 2021, 11:18 AM IST

జనసేన (jana Sena) అధినేత పవన్ కల్యాణ్ (pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను లక్ష్యం చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సాయి ధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ (Republic) ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కాకుండా మంగళగిరిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఆయన వైఎస్ జగన్ (YS Jagan) మీద యుద్ధం ప్రకటించారు. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలను, పవన్ కల్యాణ్ అభిమానుల హంగామాను పక్కన పెడితే ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు పునాదులు పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఉమ్మడి శత్రువుగా ప్రకటించి, టీడీపీతో కూడా బిజెపి, జనసేన కలిసి పనిచేస్తాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ దిశగా ఏపీ రాజకీయాలు మలుపు తిరిగినా ఆశ్చర్యం లేదు.