Asianet News TeluguAsianet News Telugu

మోడీపై కెసిఆర్ ఫైట్: ప్రశాంత్ కిశోర్ బీహార్ ఫార్ములా

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ప్రాముఖ్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పక్కా వ్యూహాన్ని అనుసరించారు. 

First Published Jul 8, 2022, 11:00 AM IST | Last Updated Jul 8, 2022, 11:00 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ప్రాముఖ్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పక్కా వ్యూహాన్ని అనుసరించారు. ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు ఆయన బీహార్ ఫార్ములా ప్రయోగించారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోడీ హైదరాబాద్ చేరుకునే రోజునే యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ రప్పించి, ఆ తర్వాత జరిగిన సమావేశంలో మోడీపై కెసిఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.అదే స్థాయిలో బిజెపి జాతీయ నేతలు జెపి నడ్డా, అమిత్ షా కెసిఆర్ మీద విరుచుకుపడ్డారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయ సంకల్ప సభలో మోడీ కెసిఆర్ పేరు ప్రస్తావించకుండా ప్రసంగించి కెసిఆర్ ది తన స్థాయి కాదని చెప్పకనే చెప్పారు. వివరాలు ఇక్కడ చూద్దాం...