70వ పడిలో అడుగు పెట్టిన మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరుగులేని ప్రస్థానాన్ని సాగించిన నరేంద్ర మోదీ... ప్రధాన మంత్రిగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరుగులేని ప్రస్థానాన్ని సాగించిన నరేంద్ర మోదీ... ప్రధాన మంత్రిగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. రెండోసారి ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టాక ఆయన మరింత స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా మహమ్మారి భారత్ లో విస్తరించకుండా అనేక కఠిన నిర్ణయాలతో కట్టడి చేశారు. భారత్ ను కవ్విస్తున్న చైనాకు గట్టి బుద్ది చెబుతున్నారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ.. జమ్మూకాశ్మీర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అలాగే... విదేశాల నుంచీ భారత్‌కు మద్దతు పెరిగేందుకు... అంతర్జాతీయ స్థాయిలో సత్సంబంధాల్ని పెంచుతున్నారు. అటు పార్టీనీ, ఇటు దేశాన్నీ ముందుకు నడిపించేందుకు ప్రయత్నిస్తున్న ఆయన నేడు70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.