Jammu kashmir elections Video: జమ్ముకాశ్మీర్ ఎన్నికల్లో స్వతంత్రుల హవా

జమ్ము కాశ్మీర్ లో మొట్టమొదటిసారి జరిగిన బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ (BDC) చైర్ పర్సన్ ఎన్నికల్లో మొత్తం 200మంది స్వత్రంత్య అభ్యర్థులు ఎన్నికయ్యారు. మొత్తం 310 బ్లాకుల్లో 200మంది స్వతంత్రులు కాగా, 81 స్థానాలు బిజేపీ గెలుచుకుంది.

First Published Oct 25, 2019, 6:43 PM IST | Last Updated Oct 25, 2019, 6:58 PM IST

జమ్ము కాశ్మీర్ లో మొట్టమొదటిసారి జరిగిన బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ (BDC) చైర్ పర్సన్ ఎన్నికల్లో మొత్తం 200మంది స్వత్రంత్య అభ్యర్థులు ఎన్నికయ్యారు. మొత్తం 310 బ్లాకుల్లో 200మంది స్వతంత్రులు కాగా, 81 స్థానాలు బిజేపీ గెలుచుకుంది.

కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. తమ నాయకుల మీద కొనసాగుతున్న నిర్భంధాలు, జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దుచేయడంలాంటి కారణాలతో వీరు దూరంగా ఉన్నారు. 

జమ్ము కాశ్మీర్ పాంథర్స్ పార్టీ (JKNPP) ఎనిమిది బ్లాకుల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ ఎలక్షన్లను బహిష్కరిస్తుందన్న ప్రకటన రాకముందే కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేశాడు. 

మొత్తం రాష్ట్రంలో ఉన్న 316 బ్లాకుల్లో రెండింటిలో ఎన్నికలు జరగలేదు. ఆ ప్రాంతాల్లో సర్పంచులు, మెంబర్లు లేకపోవడమే కారణం. ఇక మరో నాలుగు బ్లాకులు మహిళలకు కేటాయించినవి. అయితే అక్కడ ఎన్నికైన మహిళా పంచ్ లు లేకపోవడంతో వాటికి కూడా ఎన్నికలు జరగలేదు. 

కాశ్మీర్ లోని పది జిల్లాల్లో పోలింగ్ శాతం 93.65 శాతంగా ఉంటే, జమ్ము ప్రాంతంలోని పదిజిల్లాల్లో 99.4 శాతం పోలింగ్ అయ్యింది.