అందరిముందే ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే... వీడియో వైరల్

కర్ణాటక: కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే గౌరవప్రదమైన వృత్తిలో వున్న ఓ కళాశాల ప్రిన్సిపాల్ తో అందరిముందే చాలా అవమానకరంగా వ్యవహరించాడు. 

Share this Video

కర్ణాటక: కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే గౌరవప్రదమైన వృత్తిలో వున్న ఓ కళాశాల ప్రిన్సిపాల్ తో అందరిముందే చాలా అవమానకరంగా వ్యవహరించాడు. జేడిఎస్ పార్టీకి చెందిన మాండ్య ఎమ్మెల్యే ఎం. శ్రీనివాస్ నియోజకవర్గ పరిధిలోని నల్వాడి కృష్ణ రాజా వడయార్ ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేస్తున్న కంప్యూటర్ ల్యాబ్ పనుల గురించి కాలేజీ ప్రిన్సిపాల్ ను అడగ్గా అతడు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఏమయ్యందో తెలీదుగానీ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోతూ ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించాడు. చిన్న పిల్లాడిని బెదిరించినట్లు కొట్టడానికి ప్రిన్సిపాల్ మీదమీదకు వెళ్ళాడు. ఇలా బాధ్యతాయుత ఎమ్మెల్యే పదవిలో వున్న వ్యక్తి ప్రిన్సిపాల్ పై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Related Video