Asianet News TeluguAsianet News Telugu

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం (వీడియో)

భారత వాయుసేనలో మరో అధునాతనమైన హెలికాప్టర్ చేరింది. అమెరికాకు చెందిన అత్యంత అధునాతమైన అపాచీ ఎహెచ్-64 ఈ హెలికాప్టర్లు భారత వాయిసేనలో చేరాయి.

First Published Sep 4, 2019, 5:56 PM IST | Last Updated Sep 4, 2019, 5:56 PM IST

భారత వాయుసేనలో మరో అధునాతనమైన హెలికాప్టర్ చేరింది. అమెరికాకు చెందిన అత్యంత అధునాతమైన అపాచీ ఎహెచ్-64 ఈ హెలికాప్టర్లు భారత వాయిసేనలో చేరాయి.

భారత వైమానిక విభాగంలోకి అపాచీ ఎహెచ్-64 ఈ  రకానికి చెందిన 8 హెలికాప్టర్లు  చేరాయి. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ ప్రాంతంలో ఈ హెలికాప్టర్లను ఇవాళ పరిశీలించారు.

ఎహెచ్-64 ఈ రకానికి చెందిన యుద్ధ హెలికాప్టర్లను అపాచీ గార్డియన్ గా కూడ పిలుస్తారు.  ఈహెలికాప్టర్ 1700-జీఈ701డీజీ ఇంజన్ కంటే అత్యాధునికమైంది. గతంలో 1800 ఎస్‌హెచ్‌పీని ఈ హెలికాప్టర్ లో 1994కు పెంచారు.

ఎహెచ్-64 ఈ హెలికాప్టర్  23 మి.మీ. మిశ్రమ రోటర్ బ్లేడ్లను కలిగి ఉంది..ఇది ఎయిర్ క్రాఫ్ట్ గన్ల నుండి వచ్చే వేడిని కూడ తట్టుకొనే శక్తిని కలిగి ఉంటుంది.అంతేకాదు గంటకు సుమారు 300 కి.మీ వేగంతో ఈ హెలికాప్టర్ ప్రయాణం చేయనుంది.