చివరి దశకు చేరుకున్న అయోధ్య రామమందిర నిర్మాణం, రామజన్మభూమి నుండి ఏషియానెట్ న్యూస్ ఎక్స్ క్లూజివ్

2024 జనవరి సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో జరగబోయే బృహత్కార్యం గురించి ఉత్కంఠ పెరుగుతున్నది.

First Published Sep 12, 2023, 9:41 PM IST | Last Updated Sep 12, 2023, 9:41 PM IST

2024 జనవరి సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో జరగబోయే బృహత్కార్యం గురించి ఉత్కంఠ పెరుగుతున్నది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగితే పూజలు చేసే అవకాశం కోసం రామ భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అసాధారణ మందిరం అసమాన శిల్పనైపుణ్యానికి, ఇంజినీరింగ్‌కు తార్కాణం. జనవరి నెలలో ఈ మందిరం ప్రారంభం కానున్నది.

ప్రస్తుతం ఈ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. 2.7 ఎకరాల్లో 54,700 చదరపు అడుగుల వైశాల్యంలో ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ఈ మహత్కార్యాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన ఆలయ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పర్యవేక్షిస్తున్నారు.