Asianet News TeluguAsianet News Telugu

ఈ విజయంలో టీం మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైనది...భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్ట్టి పెట్టాం....

జాబిల్లిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన మూడో ప్రయోగం చంద్రయాన్-3.

First Published Sep 17, 2023, 5:04 PM IST | Last Updated Sep 17, 2023, 5:04 PM IST

జాబిల్లిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన మూడో ప్రయోగం చంద్రయాన్-3. ISRO చరిత్రలోనే అత్యంత భారీ ప్రయోగం ఇది. అయితే నాలుగు సంవత్సరాల క్రితం ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలం మీద దక్షిణ ధ్రువంపై దిగుతూ సాంకేతిక సమస్యతో కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో ఆనాటి తప్పిదాలు మరోసారి రిపీట్ కాకుండా లోపాలను సవరించుకుని మరింత ఉత్సాహంతో చంద్రయాన్-3ను చేపట్టి విజయం సాధించారు..అయితే చంద్రయాన్ విజయం తరువాత ఒకసారి వెనక్కి చూసుకుంటే వారు ఈ అద్భుత విజయం సాధించడానికి ముందు ఎటువంటి కృషి చేసారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారు అనే విషయాలు చంద్రయాన్ 3  ప్రాజెక్ట్ డైరెక్టర్ పళనివేల్ వీరముత్తువేల్, మరియు అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన లను అడిగి తెలుసుకుందాం...