Asianet News TeluguAsianet News Telugu

మీటర్ పబ్లిక్ టాక్ : సినిమా కిలోమీటర్ పోయింది..!

డిఫెరెంట్ యాటిట్యూడ్ తో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలు చేస్తున్నాడు. 

First Published Apr 7, 2023, 11:57 AM IST | Last Updated Apr 7, 2023, 11:57 AM IST

డిఫెరెంట్ యాటిట్యూడ్ తో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలు చేస్తున్నాడు. 2019లో కిరణ్ రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎస్ఆర్ కళ్యాణండపం, వినరో భాగ్యము విష్ణు కథ మాత్రమే కిరణ్ చేసిన చెప్పుకోదగ్గ చిత్రాలు. మిగిలినవి నిరాశపరిచాయి. అయినా రిజల్ట్ తో సంబంధం లేకుండా కిరణ్ వరుస చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన 'మీటర్' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమేష్ కదూరి  దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అతుల్య రవి.. కిరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో చూద్దాం.