Asianet News TeluguAsianet News Telugu

సినిమా మొత్తం ల్యాగు...కేవ్..కేవ్ మని అరుపులు తప్ప ఏమి లేవు...

13 ఏళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్’ఇప్పటికి అందరికీ గుర్తే.  

First Published Dec 16, 2022, 1:11 PM IST | Last Updated Dec 16, 2022, 1:11 PM IST

13 ఏళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్’ఇప్పటికి అందరికీ గుర్తే.  ప్రముఖ  దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇక ఈ సినిమాకు జనం పట్టం కట్టడంతో, వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా అవతార్-2 మూవీ ఈ రోజే ప్రేక్షకులను పలుకరించింది..ప్రపంచ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ (Avatar The Way Of Water) అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయినా ఈ చిత్రం అంచనాలు అందుకుంది లేదా అన్నది వారి మాటల్లోనే...