omicron: కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం... విద్యార్థులకు భారీగా టెస్టులు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న వేళ కరీంనగర్ జిల్లాలో భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 

First Published Dec 6, 2021, 5:35 PM IST | Last Updated Dec 6, 2021, 5:35 PM IST

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న వేళ కరీంనగర్ జిల్లాలో భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చల్మెడ మెడికల్ కాలేజీలోని వైద్య విద్యార్థులు 46 మందికి కరోనా నిర్దారణ కావడంతో అలజడి రేగింది. దీంతో చల్మెడ మెడికల్ కాలేజికి కిలోమీటర్ దూరంలో ఉన్న దుర్షెడ్ గ్రామంలో స్కూల్ విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.   పాఠశాలల్లో శానిటేషన్ కూడా నిర్వహించారు. ఇలా రూరల్ మండలంలో కరోనా కేసులు పెద్దఎత్తున నమోదు అవ్వడంతో అన్ని గ్రామ పంచాయితీలు అప్రమత్తమయ్యాయి.