కర్ణాటక చేరుకున్న ఏషియానెట్ న్యూస్ - NCC వజ్ర జయంతి యాత్ర

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ చేపట్టిన వజ్ర జయంతి యాత్రను కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. 

First Published Jul 20, 2022, 6:25 PM IST | Last Updated Jul 20, 2022, 6:25 PM IST

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ చేపట్టిన వజ్ర జయంతి యాత్రను కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటకలోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏషియానెట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా, కన్నడ ప్రభ, సువర్ణ న్యూస్ చీఫ్ మెంటర్ రవి హెగ్డే తదితరులు పాల్గొన్నారు. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏషియానెట్ నెట్‌ నెట్‌వర్క్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ  India@75యాత్ర కేరళ నుంచి ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పర్యటించి ఆగస్టు 15న దేశ రాజధాని ఢిల్లీలో ఈ యాత్ర ముగుస్తుంది.