కర్ణాటకలో ముగిసిన ఏషియానెట్ న్యూస్ - ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర
స్వాతంత్ర్య భారత 75వ వసంతాన్ని పురస్కరించుకుని ఏషియానెట్ గ్రూప్ నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవ్ యాత్ర ఈ రోజు కర్ణాటకలో ముగిసింది.
స్వాతంత్ర్య భారత 75వ వసంతాన్ని పురస్కరించుకుని ఏషియానెట్ గ్రూప్ నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవ్ యాత్ర ఈ రోజు కర్ణాటకలో ముగిసింది. ఈ యాత్ర కర్ణాటకలో అనేక కీలక ప్రాంతాల గుండా సాగి ఈ రోజు రాష్ట్రం దాటి పోతున్నది. ఈ సందర్భంగా కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ జెండాను అప్పగించారు. అంతేకాదు, ఈ యాత్రలో పాల్గొన్న ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆయన సర్టిఫికేట్లను అందించారు. కన్నడ ప్రభ- సువర్ణ న్యూస్ చీఫ్ మెంటర్ రవి హెగ్దే, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ సురేంద్ర, ప్రముఖ డాక్టర్ హృషికేశ్ దామ్లే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ యాత్ర కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఛండీగడ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా సాగి లడాఖ్‌లో ముగుస్తుంది.